తెలుగు చిత్ర పరిశ్రమను ప్రోత్సహించాలి అనే సదుద్దేశం తో ఏం. ఏ. సుభాన్ గారు కళా సాగర్ అనే ఒక వేదిక ను ప్రాంభించాలి అని తలచి, భానుమతి గారిని అధ్యక్షత వహించ మన్నారు, కానీ ఆవిడ ఆ వేదిక వద్దకు వచ్చి ప్రారంభించకుండానే వెళ్లిపోయారు. 1972 లో సుభాన్ గారు మద్రాసు లో తెలుగు కళాకారులకు ఒక వేదిక ఉంటె బాగుంటుంది అనే ఉద్దేశం తో ” కళా సాగర్ ” అనే వేదిక ప్రారంభించాలి అనుకోని, దానికి అధ్యక్షత వహించమని భానుమతి గారిని కోరారు, దానికి ఆమె అంగీకరించారు. అలాగే ప్రారంభకులుగా అక్కినేని గారిని నిర్ణయయించి, ఇన్విటేషన్ కార్డ్స్ వేశారు. ఉదయం పది గంటలకు ప్రారంభ కార్యక్రమం అయితే,
ఎనిమిది గంటలకే వచ్చిన భానుమతి గారు, ఫోటో గ్రాఫేర్స్ ని పిలిచి ఫోటోలు తీయించుకొని, వెళ్లి పోబోతుంటే, ఆశ్చర్యం గ కారణం అడిగిన సుభాన్ గారితో, ఈ సభకు అధ్యక్షత వహించాలిసింది నేను, ప్రారంభించ వలసింది అక్కినేని నాగేశ్వర రావు. అటువంటిది ఇన్విటేషన్ లో ప్రారంభకులు అని అక్కినేని పేరు ముందు వేసి, అధ్యక్షులు అని నా పేరు తరువాత వేశారు, అందుకే నేను ఈ సభకు అధ్యక్షత వహించటం లేదు, మిమ్మల్ని బాధ పెట్టకూడదని ముందే వచ్చి వెళ్ళిపోతున్నాను అంటూ వెళ్లిపోయారట. ఆమె సంగతి తెలిసిన సుభాన్ గారు చేసేది ఏమి లేక, అక్కినేని గారి చేత” కళా సాగర్” వేదిక ప్రారంభించారు.