
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రాబోతున్న స్పిరిట్ బడ్జెట్ సుమారు రూ.300 కోట్లుగా ఉంది. ఇది సందీప్ రెడ్డి వంగాకు కూడా ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు. గతంలో యానిమల్ (రూ.915 కోట్ల కలెక్షన్) వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన వంగా, ఈసారి ప్రభాస్‌తో పనిచేయనుండటంపై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా నివేదిక ప్రకారం.. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్ నటించనుంది. కాజోల్ వంటి సీనియర్, పాపులర్ నటి ఈ చిత్రంలో భాగం కావడం అనేది సౌత్ ఇండియన్ సినిమా, బాలీవుడ్ మధ్య ఒక ముఖ్యమైన క్రాస్ ఓవర్ మూమెంట్గా సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్పిరిట్ ఇప్పటికే మల్టీ-స్టారర్ సినిమాగా మారింది. గతంలో రణబీర్ కపూర్ కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నాడనే వార్త వచ్చింది..!!
