in

kajol devgan about ‘marriage expiry date’ controversy!

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ కోసం కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ఓ చర్చా కార్యక్రమానికి హోస్టులుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్‌కు నటులు విక్కీ కౌశల్, కృతి సనన్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాజోల్.. “నచ్చని వారితో బలవంతంగా జీవించడం ఎందుకు? పెళ్లికి కూడా గడువు తేదీ ఉండాలి కదా” అని వ్యాఖ్యానించారు. దీనికి ట్వింకిల్ మద్దతు పలకగా, విక్కీ, కృతి మాత్రం ఈ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు.

ఈ వ్యాఖ్యలు క్షణాల్లో వైరల్ కావడంతో నెటిజన్లు కాజోల్, ట్వింకిల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. వివాహ బంధం విలువను తగ్గించేలా మాట్లాడటం సరికాదని, బాధ్యతగల స్థానంలో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమాజంపై చెడు ప్రభావం చూపుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. విమర్శలు పెరగడంతో కాజోల్, ట్వింకిల్ స్పందించారు. షోలో సరదాగా జరిగిన సంభాషణను సీరియస్‌గా తీసుకోవద్దని కాజోల్ కోరారు. ఇది కేవలం హాస్యం కోసమేనని, మొదటి ఎపిసోడ్ నుంచే డిస్క్లైమర్ ఇస్తున్నామని ట్వింకిల్ వివరణ ఇచ్చారు..!!

mistake and downfall of actress rambha!