
ప్రస్తుతం ‘నాంది’ అనే సినిమాలో నటిస్తున్నాడు అల్లరి నరేష్, దీని తరువాత ఓ కొరియన్ మూవీ రీమేక్ లో నటించనున్నాడని సమాచారం. అయితే ఈ సినిమాకు సంబందించిన పనులు అప్పుడే మొదలు పెట్టేసారు నిర్మాతలు. కొరియన్ సూపర్ హిట్ మూవీ “డాన్సింగ్ క్వీన్” రీమేక్ రైట్స్ దక్కించుకుని స్క్రిప్ట్ పనుల్లో బిజీ గ ఉంది చిత్ర యూనిట్. అంతే కాకుండా నరేష్ కు జతగా బ్యూటీ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేసారు చిత్ర యూనిట్. నిర్మాతలు ఇల అడగగానే కాజల్ ఈ సినిమా చేయడానికి ఒప్పుకుందట. సౌత్ లో ఆల్మోస్ట్ అందరూ టాప్ హీరోస్ తో చేసిన కాజల్ ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ – 2 లో నటిస్తుంది, ఈ సినిమా తప్ప కాజల్ కు మారొక సినిమా లేదు.. అయితే, ఎందరో టాప్ హీరోస్ తో నటించి ఎంతో క్రేజ్ అండ్ పాపులారిటీ తెచ్చుకున్న నువ్వు చివరికి అల్లరి నరేష్ సినిమా లో నటిస్తావా అని అడిగితే.. టైం అండ్ పోసిషన్ చూసి జీవితం తలకిందులైనప్పుడు సినిమా ఏదైనా తప్పదు కదా అన్నదట కాజల్.

