సౌత్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి భారీ స్టార్డం హీరోయిన్స్ లో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. మరి కాజల్ అయితే తన పెళ్లి తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ని మళ్ళీ మొదలు పెట్టగా పలు సినిమాలు సహా వెబ్ సిరీస్ లలో నటిస్తుంది. ఇక రీసెంట్ గానే మాస్ గాడ్ నందమూరి బాలయ్య 108 లో హీరోయిన్ గా కూడా లాక్ అయ్యింది. అయితే ఇపుడు బయట బాగానే కనిపిస్తున్న తాను లేటెస్ట్ గా నేషనల్ మీడియాతో అయితే ఇంటరాక్ట్ అయ్యింది. మరి ఇందులో తాను చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.
కాగా కాజల్ అయితే మాట్లాడుతూ తాను ఎక్కువగా విలువలు, ఎకో సిస్టం లాంటివి అన్నీ సౌత్ సినిమాలోనే నేను చూశానని కానీ నార్త్ సినిమాలో ఇవేమి లేవని ఓపెన్ గా బోల్డ్ స్టేట్మెంట్ అయితే అందించింది. దీనితో కాజల్ నుంచి ఈ షాకింగ్ మాటలు పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. అలాగే దీనితో సౌత్ ఇండియా సినిమా వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే నార్త్ ఆడియెన్స్ మాత్రం దీనిపై ఎలాంటి రియాక్షన్ ఇస్తారో చూడాలి. మొత్తానికి అయితే కాజల్ మాత్రం రీ ఎంట్రీ లో కాస్త అటెన్షన్ ని గట్టిగా రాబడుతుందని చెప్పుకోవాలి..!!