పెళ్లికి ముందు వరుస సినిమాల్లో నటించిన కాజల్, పెళ్లి తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ రెండో ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పటివరకు చిరంజీవి, బాలకృష్ణ లాంటి సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కానీ నాగార్జున, వెంకటేష్ లతో మాత్రం ఇప్పటికీ కలిసి పనిచేయలేకపోయింది. వెంకటేష్ సినిమాల్లో ఆమెకు ఇప్పటివరకు అవకాశం రాలేదు..
కానీ నాగార్జునతో మాత్రం రెండు సార్లు అవకాశం వచ్చినా, కాజల్ వాటిని వదులుకుంది. ‘రగడ’ సినిమాలో కాజల్ నటించాల్సి ఉండేది. కానీ చివరి నిమిషంలో ఆమె నుంచి “నో” చెప్పిందట. అదే విధంగా ‘ది గోస్ట్’ మూవీకి కూడా ఆమెకు ఛాన్స్ వచ్చిందని, కానీ ఆ అవకాశం కూడా కాజల్ వదులుకుందని సమాచారం. ఈ రెండు అవకాశాల విషయంలో ఆమె కథ నచ్చకపోవడం వల్లే సినిమాలు చేయలేకపోయానని చెప్పినట్టు నెట్టింట ఒక న్యూస్ వైరల్ అవుతోంది..!!