in

Kajal Aggarwal receives UAE’s prestigious Golden visa!

కొద్దిమంది ప్రముఖులకు మాత్రమే ఇచ్చే గోల్డెన్ వీసాను UAE దేశం..లేటెస్టుగా సినీ నటి కాజల్ అగర్వాల్ కు కూడా అందజేసింది. దీనిపై కాజల్ స్పందిస్తూ, యూఏఈ ప్రభుత్వం నుంచి గోల్డెన్ వీసా అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపింది. తమవంటి కళాకారులకు UAE మొదటి నుంచి ప్రోత్సాహం అందిస్తోందని సంతోషం వ్యక్తం చేసింది. ఇది తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని, భవిష్యత్తులో యూఏఈలో చేపట్టబోయే కార్యకలాపాల పట్ల ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని కాజల్ తెలిపింది.

ఈ సందర్భంగా మహ్మద్ షానిద్, సురేశ్ పున్నస్సెరిల్, నరేశ్ కృష్ణలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు  ప్రకటించింది. UAE అందించే ఈ గోల్డెన్ వీసా ఉంటే విదేశీయులు ఎలాంటి స్పాన్సర్ షిప్ అవసరం లేకుండా యూఏఈలో ఉద్యోగాలు చేసుకోవడానికి, నివసించడానికి వీలు కలుగుతుంది. అంతేకాదు, గోల్డెన్ వీసా ఉన్నవారిని UAE పౌరులుగా గుర్తిస్తారు. వారు అక్కడ సొంతంగా వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. 5, 10 సంవత్సరాల కాలపరిమితి ఉన్నప్పటికీ ఈ వీసా ఆటోమేటిగ్గా రెన్యువల్ అవుతుంది.

THAT IS Sankarabharanam SOMAYAJULU!

‘DJ Tillu’s Neha Shetty fires on journalist for sexiest question!