in

Kajal Aggarwal Breaks Silence On Pregnancy Rumors!

హీరోయిన్‌ కాజల్‌ వివాహం జరిగి ఏడాది పూర్తయింది.తన చిరకాల మిత్రుడు, ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లూను గతేడాది అక్టోబర్‌ 30న కాజల్‌ పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి అనంతరం కాజల్‌ సినిమా షూటింగ్స్‌తో బిజీ అయిపోయింది. ఈ క్రమంలో తనకు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త కొత్తకాలంగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాజల్‌ గర్భం దాల్చిందని, త్వరలోనే ఆమె సినిమాలకు బ్రేక్‌ చెప్పనుందంటూ కథనాలు వెలువడ్డాయి.అయితే ఇప్పటికీ ఈ వార్తలపై ఆమె స్పందించకపోవడం అదే నిజం అనుకుంటున్నారంతా..ఈ నేపథ్యంలో తాజాగా కాజల్‌ తన ప్రెగ్నెంట్‌ విషయంపై స్పందించింది. ఇటీవల కాజల్  మాట్లాడుతూ తనపై వస్తున్న వార్తలకు స్పష్టత ఇచ్చింది.

ఈ మేరకు కాజల్‌ మాట్లాడుతూ.. ‘నా ప్రెగ్నెన్సీ విషయంపై ఇప్పుడు మాట్లాడాలనుకోవడం లేదు. సమయం వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తా. మాతృత్వం అనేది ఓ అద్భుతమైన అనుభూతి. నా చెల్లెలు తల్లి కాబోతున్నప్పుడు తను ఎలాంటి ఫీలింగ్స్‌ ఫేస్‌ చేసింది.. ఇప్పుడు తల్లి అయ్యాక ఎలా ఫీల్‌ అవుతుందో దగ్గరుండి గమనించాను’ అని పేర్కొంది.ఇక ‘నిషా కుమారుడు ఇషాన్‌తో ఎక్కువ సమయం గడుపుతుంటా. అప్పుడు నేను తనకి తల్లిని అనే భావనతో గడుపుతాను. నా విషయానికి వచ్చేసరికి భిన్నమైన భావన కలుగుతోంది. ఒక్కోసారి తల్లి అవ్వాలనే భావనే నాలో భయాన్ని కలిగిస్తోంది. కానీ నాకంటూ ఓ బిడ్డ ఉంటే జీవితం ఎంతో అందంగా మారిపోతుందని అనుకుంటున్నాను’ అంటూ కాజల్‌ చెప్పుకొచ్చింది..

nivetha thomas latest clicks in saree!

Suriya’s ‘Jai Bhim’ Beats Shawshank Redemption On IMDb!