కాజల్ అగర్వాల్ 35 సంవత్సరాలు దాటినా అదే ఫిజిక్, అదే గ్లామర్ ఎలా మెయింటైన్ చేస్తుంది. దీని సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలనే ఉత్సుకత చాలా మందిలో ఉంటుంది. అయితే డైలీ డైట్ చాలా సింపుల్‌గా ఉంటుందట. రోజూ పొద్దున్నేఓ గుడ్డు తింటుంది కాజల్. ఆ తర్వాత గంట గ్యాప్ ఇచ్చి ఏదో ఒక కర్రీతో చేసిన జొన్న రొట్టెలు తింటుంది. లంచ్‌కి రెండు గంటల ముందు ఫ్రూట్స్ తింటుంది. మధ్యాహ్నా భోజనంలో పప్పు, అన్నం, కూరగాయలు ఉంటాయి. సాయంత్రం ఏదైనా టోస్ట్ లేదా శాండ్ విచ్ తింటుంది. ఇక డిన్నర్ మథ్యాహ్నా భోజనం మాదిరిగానే ఉంటుందట.
మధ్యమధ్యలో ప్రొటీన్ షేక్ లేదా కొబ్బరి నీళ్లు తాగుతుంది. వీటికి అదనంగా పొద్దున్న, సాయంత్రం ఎర్ల్-గ్రే టీ తాగుతుంది..కాజల్ పూర్తిగా శాకాహారి. ప్రోటీష్ షేక్స్‌కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఆంధ్రా వంటకాలు కాజల్‌కి చాలా ఇష్టం. రాజ్మా చావల్, పన్నీర్, అమ్మ చేసే పరాఠాలని ఇష్టంగా తింటుంది. ఇక ప్రతి రోజూ తన మెనూలో ఫైబర్, కార్బొహైడ్రేట్స్, ప్రొటీన్లు ఉండేలా జాగ్రత్త తీసుకుంటుంది. ఇక సౌందర్య ఉత్పత్తుల విషయానికి వస్తే ఐఎస్ అనే బ్రాండ్ కు చెందినవి మాత్రమే వాడుతుందట.