కైకాల సత్యనారాయణ గారితో వాదులాటకు దిగి, తనకు వచ్చిన సినిమా అవకాశాన్ని కోల్పోయిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్. సోమా రాజు అనే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక కామెడీ కథ రెడీ చేసుకొని సత్యనారాయణ గారి ఆశీర్వాదం తో, హీరో రాజేంద్ర ప్రసాద్ తో 1996 లో “కలియుగం లో గందరగోళం “అనే సినిమా ప్రారంభించారు. అన్నపూర్ణ స్టూడియో లో షూటింగ్ సందర్భం గ కలుసుకున్న సత్యనారాయణ, రాజేంద్ర ప్రసాద్ పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటూ, అప్పట్లో మచిలీపట్టణం పార్లమెంట్ కు పోటీ చేసిన సత్యనారాయణ గారి గెలుపో కోసం తాను ప్రచారం చేసిన విషయం ప్రస్తావించారు రాజేంద్ర ప్రసాద్, అందుకు సత్యనారాయణ గారు నవ్వుతు థాంక్స్ చెప్పారు.
అయినా రాజేంద్ర ప్రసాద్ ఆ టాపిక్ ను వదలకుండా ఏంటి సింపుల్ గ థాంక్స్ చెప్పి ఊరుకున్నారు అంటూ టాపిక్ ను జటిలం చేసి, కొంత హార్డ్ గ డిస్కషన్ చేయటం మొదలుపెట్టారు. సత్యనారాయణ గారు ఏంటయ్యా థాంక్స్ చెప్పాను, మరి అంతకంటే ఏమి చేయమంటావు అంటూ చిరాకు పడ్డారు, అయినా రాజేంద్ర ప్రసాద్ శాంతించ లేదు, టాపిక్ పొడిగించటం తో షూటింగ్ ఆపేసారు డైరెక్టర్. కొత్తగా డైరెక్టర్ అయిన సోమరాజు గారికి సత్యనారాయణ గారు చాల ముఖ్యం, ఎక్కడ షూటింగ్ ఆగిపోతుందో అని భయపడి రాజేంద్ర ప్రసాద్ కి బదులుగా అలీ ని హీరో గ పెట్టి సినిమా పూర్తి చేసారు. చూడండి కొన్ని చిన్న చిన్న విషయాలు ఎంత దూరం వెళతాయో.చిలికి చిలికి గాలి వాన అవటం అంటే ఇదేనేమో..