2003 వ సంవత్సరం, గుణశేఖర్, డైరెక్షన్లో మహేష్ బాబు నటించిన సూపర్ హిట్ మూవీ “ఒక్కడు”. ఈ చిత్రానికి మొదట అనుకున్న పేరు “కబడ్డీ”కానీ, “ఒక్కడు” అని నామకరణం చేయటానికి కారణం ఏమిటి? ఈ చిత్రం లో మహేష్ బాబు నటించిన పాత్ర ఒక కబడ్డీ ప్లేయర్, కాబట్టి కబడ్డీ అని పేరు పెట్టాలి అనుకున్నారు. ఈ చిత్ర నిర్మాణ సమయం లో నిర్మాత ఏం.ఎస్. రాజు గారు, చిరంజీవి గారు, అర్జున్ గారు నటించిన ” శ్రీ మంజునాథ” చిత్రం చూడటం జరిగింది. ఆ చిత్రం లో మంజునాథుని స్తుతిస్తూ ” ఒక్కడే మంజు నాథుడు ఒక్కడే ” అనే పాట విన్న తరువాత, ఏం.ఎస్. రాజు గారు ఈ చిత్రానికి “ఒక్కడు” అని పేరు పెట్టాలి అనుకోని గుణశేఖర్ గారికి, మహేష్ బాబు కి చెప్పటం జరిగింది.
కబడ్డీ మ్యాచ్ కోసం కర్నూల్ వెళ్లిన మహేష్ బాబు, అక్కడ ఒక ఫ్యాక్షనిస్ట్ దాష్టికం నుంచి స్వప్న అనే అమ్మాయిని కాపాడి ఆమెకు అండగా నిలుస్తాడు. రాయలసీమలో పేరుమోసిన ఒక ఫ్యాక్షనిస్ట్ నుంచి స్వప్న అనే అమ్మాయిని కాపాడటం కోసం ఆమె వెనుక ఒక సైన్యం లాగా నిలబడి పోరాడేది ఒక్క మహేష్ బాబు ధరించిన పాత్ర అజయ్ వర్మ మాత్రమే, కాబట్టి “ఒక్కడు” అనే టైటిల్ సరైనదని రాజు గారు చెప్పటం, ఆ టైటిల్ డైరెక్టర్ కి, హీరో కి నచ్చటం తో కబడ్డీ టైటిల్ కాస్త “ఒక్కడు” గ మారిపోయింది.