కదిరి వెంకట్ రెడ్డి, ( కే.వి. రెడ్డి)” పాతాళ భైరవి”,”మాయ బజార్” వంటి దృశ్య కావ్యాల సృష్టికర్త, నందమూరి తారక రామ రావు గారికి గురుతుల్యులు. అటువంటి గురువు గారి జీవితం ఆధారంగా ” పుణ్య దంపతులు” అనే సినిమా తీయాలి అనుకున్నారు యెన్.టి.ఆర్. టైటిల్ కూడా రిజిస్టర్ చేసారు కానీ ఆ సినిమా కార్యరూపం దాల్చలేదు. అసలు యెన్.టి.ఆర్. గారికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, కే.వి. రెడ్డి గారు అనారోగ్యం తో ఉన్నప్పుడు డి.వి.నరస రాజు గారితో కలసి గురువు గారిని చూడటానికి వారి ఇంటికి వెళ్లారు యెన్.టి.ఆర్. . కే.వి.రెడ్డి గారి అర్ధాంగి వారిని చూడగానే నేనుండగానే ఆయన కడతేరిపోతే బాగుంటుంది,
ఆయన ఎంతటి అభిమానవంతుడో మీకు తెలుసు కదా, కన్న బిడ్డల్ని కూడా నోరు తెరిచి ఏమి అడగలేరు, అంటూ కంట తడి పెట్టారట. గదిలో ఉన్న రెడ్డి గారి దగ్గరకు వెళ్లిన యెన్.టి.ఆర్. తో నేనుండగానే ఆవిడ వెళ్ళిపోతే బాగుంటుంది, నేను లేక పోతే పిల్లలు ఆమెను నిర్లక్ష్యం చేస్తారేమో అని బాధ పడ్డారట. వారిద్దరి మధ్య ఉన్న ఆ అవ్యాజం అయిన ప్రేమ చూసి యెన్.టి.ఆర్. చలించిపోయారట. అందుకే గురువు గారి జీవితాన్ని చలన చిత్రం గ మలచాలి అనుకున్నారు, కానీ కారణాలు తెలియవు ఆ సినిమా కార్య రూపం మాత్రం దాల్చలేదు.