ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఎన్టీఆర్ – `ఎవరు మీలో కోటీశ్వరులు` వచ్చేసింది. ఆగస్టు 22 – రాఖీ పూర్ణిమ సందర్భంగా జెమినీ టీవీలో ఈ షో టెలీకాస్ట్ అయ్యింది. ఈ సీజన్‌లో తొలి ఎపిసోడ్ కి రామ్ చరణ్ అతిథిగా విచ్చేశాడు. `ఆర్.ఆర్.ఆర్`లో వీరిద్దరూ కలసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ బాండింగ్, ఫ్రెండ్ షిప్.. ఈ ఎపిసోడ్ లో కనిపించింది. షో ఆద్యంతం సరదా, సరదాగా సాగింది. ఎన్టీఆర్ కి టీవీ షోని హోస్ట్ చేయడం కొత్త కాదు. తన అనుభవాన్ని బుల్లి తెరపై కూడా చూపించాడు. సరదా సంభాషణతో ఆకట్టుకున్నాడు.
Jr NTR’s EMK Show To Secure Top Position!
రామ్ చరణ్ కూడా.. కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని పంచుకుని, ఈ షోని రక్తి కట్టించాడు. ఎన్టీఆర్ ని వెండి తెరపై చూసి చాలా కాలం అయ్యింది. `ఆర్.ఆర్.ఆర్` ఎప్పుడొస్తుందో తెలీదు. ఈ గ్యాప్ ని.. `ఎవరు మీలో కోటీశ్వరులు` ఫుల్ ఫిల్ చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తొలి ఎపిసోడ్ కి అదిరిపోయే వ్యూవర్ షిప్ వచ్చే అవకాశం ఉందని జెమినీ టీవీ భావిస్తుంది. ఈ రేటింగు ఒకట్రెండు రోజుల్లో బయటకు వస్తుంది. మొత్తానికి ఫస్ట్ ఎపిసోడ్ సూపర్ హిట్ అయ్యింది. ఇక… రేటింగుల విషయంలో కొత్త రికార్డులు సృష్టించడమే తరువాయి.