నేను చనిపోయేవరకు తారక్ తో స్నేహం నా మనసులో ఉంటుంది. దేవుడు నాకిచ్చిన అతిపెద్ద గిఫ్ట్ తారక్ స్నేహం”అని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. నిన్న సాయంత్రం చెన్నై లో ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న చరణ్ మాట్లాడుతూ” ఈ ఈవెంట్ కి వచ్చిన వీరందరికి ధన్యవాదాలు. ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాము..మా గురువు అనాలా.. మా హెడ్ మాస్టర్ అనాలా ప్రిన్సిపాల్ అనాలా.. నాకు ఇండస్ట్రీ ఫస్ట్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనాలా..
మా ఇద్దరినీ కలిపి సినిమా తీసినందుకు రాజమౌళి గారికి థాంక్స్..ఆయన గురించి చెప్పడానికి ఒక స్టేజ్ సరిపోదు.. నాకు అవకాశం ఇచ్చినందుకు.. ముఖ్యంగా ఎన్టీఆర్ లాంటి బ్రదర్ ని ఇచ్చినందుకు థాంక్స్. ఈ సినిమా కోసం పనిచేసిన అందరికి థాంక్స్. తమిళ్ డబ్బింగ్ చెప్పను అని చెప్పినా.. మాకు నేర్పించి డబ్బింగ్ చెప్పించిన మదన్ గారికి థాంక్స్..ఇక నా ప్రియమైన మిత్రుడు.. నాకన్న వయస్సులో నాకన్నా పెద్దవాడు..కానీ నిజ జీవితంలో.. మెంటాలిటీలో చిన్నపిల్లాడిలా ఉంటాడు…చూడడానికి మాత్రం సింహంలా ఉంటాడు.
కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ వ్యక్తితో.. నేను ముఖ్యంగా దేవుడికి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటె ఇలాంటి బ్రదర్ ని నాకు దేవుడు ఇచ్చినందుకు.. ఈ సినిమా హిట్ అయితే ప్రొడ్యూసర్స్ తో పాటు మేము ఆనందపడతాము. నేను అంతకన్నా ఆనందపడిన విషయం ఎన్టీఆర్ లాంటి బ్రదర్ నాకు దొరికినందుకు.. నేను చనిపోయేవరకు తారక్ స్నేహం నా మనుస్సులో పెట్టుకుంటాను. తారక్ చెప్పినట్లు అందరు జాగ్రత్తగా వెళ్ళండి అంటూ ముగించారు.