in

Jr NTR to take up Anjaneya Swamy deeksha!

RRR మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆంజ‌నేయ దీక్ష‌లో ఉన్నారట. వెండితెర ఫై స్టార్ హీరోస్ అయినప్పటికీ..వారిలోను భక్తి భావం ఉంటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ప్రతి ఏడాది అయ్యప్ప మాల వేస్తుంటారు. ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ల‌క్ష్మీ నర‌సింహ స్వామి దీక్ష‌ను చేప‌ట్టారు. నితిన్ కూడా అంతే.. ఆంజ‌నేయ‌స్వామి దీక్ష‌ను చేశారు. ఇప్పుడు ఈ హీరోల బాట‌లోనే ఎన్టీఆర్ నడుస్తున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ఆం జ‌నేయ దీక్ష‌లో ఉన్నార‌ట‌. ఈ దీక్ష 21 రోజుల పాటు ఉంటుంది..

అస‌లు ఎప్పుడూ ఆంజ‌నేయ స్వామి దీక్ష చేయ‌ని ఎన్టీఆర్ ఫస్ట్ టైం ఈ దీక్ష చేస్తున్నారు. ఇక ఈ దీక్ష తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో తన 30 వ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకొని ఉంది. ఇక కొరటాల శివ కూడా ప్రస్తుతం ఆచార్య రిలీజ్ లో బిజీ గా ఉన్నారు. మంగళవారం విడుదల చేసిన ట్రైలర్ సినిమా ఫై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.. ట్రైలర్ లో బోయపాటి మార్క్ యాక్షన్ కనిపించడం తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏప్రిల్ 29 న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది.

28 YEARS FOR Bhairava Dweepam!

K.G.F: Chapter 2