విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి కాంబోలో భారీ సినిమా వస్తుందని తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా నుండి ఎలాంటి అప్డేట్స్ రావట్లేదని విజయ్ ఫ్యాన్స్ కాస్త అప్సెట్ లో ఉండగా లేటెస్ట్ గా ఒక న్యూస్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. విజయ్ దేవరకొండ 12వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకి ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడని టాక్..
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా ఇంట్రడక్షన్ సీన్స్ ఇంకా విజయ్ దేవరకొండ పాత్ర నేపథ్యం వస్తుందట. స్టార్ హీరోలు మరో స్టార్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది కామనే. మహేష్ బాబు, చిరంజీవి, ప్రభాస్, రవితేజ ఇలా చాలామంది స్టార్స్ ఇప్పటికే మరో హీరో సినిమాకు వాయిస్ ఓవర్ అందించారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా విజయ్ దేవరకొండ సినిమాకు సపోర్ట్ గా తన వాయిస్ అందిస్తున్నట్టు తెలుస్తుంది. VD12వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారన్న టాక్ నడుస్తుంది. ఎన్టీఆర్A వాయిస్ ఓవర్ ఇస్తే మాత్రం ఈ సినిమాకు అది స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు..!!