
దిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సినీ నటుడు ఎన్టీఆర్..సోషల్ మీడియాలో తనపై వస్తున్న అభ్యంతరకర, తప్పుడు పోస్టులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని కోర్టుకు తెలియజేశారు. దీంతో సంబంధిత ఖాతాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు స్వీకరించింది. 2021 ఐటీ చట్టంలోని నిబంధనలను అనుసరించి ఆ సోషల్‌మీడియా ఖాతాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించింది..
ఈ వ్యవహారంపై తదుపరి విచారణ డిసెంబరు 22కు వాయిదా పడింది. ఈ కేసులో ఎన్టీఆర్ సమర్పించిన వివరాలు, సోషల్‌మీడియా లింకులు, పోస్ట్‌ల ప్రభావంపై కోర్టు మరింత సమాచారం కోరినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ కేసు ఓ కీలక దశలోకి ప్రవేశించగా, అనుచిత ఆన్‌లైన్ కంటెంట్‌పై తీసుకోనున్న చర్యలతో ఇతర సోషల్‌మీడియా వేదికలు కూడా అప్రమత్తం కావాల్సి వస్తుందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి..!!

