రామ్ చరణ్, ఎన్టీఆర్ బాగా క్లోజ్ అనే విషయం చాలామందికి తెలుసు. ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వచ్చిన తర్వాత వీళ్లు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇంతకీ వీళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ ఎప్పుడు, ఎక్కడ మొదలైంది? చాలామంది ఆర్ఆర్ఆర్ తోనే వీళ్ల స్నేహం ఆరంభమైందని అనుకుంటున్నారు. కానీ చాలా ఏళ్ల కిందటే తామిద్దరం ఫ్రెండ్స్ అయ్యామని చెబుతున్నాడు ఎన్టీఆర్.
“ప్రపంచానికి తెలియకముందే మేమిద్దరం ఫ్రెండ్స్. చాలా ఏళ్ల కిందట స్టార్స్ అందరూ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడారు. అప్పుడు చరణ్ తో ఎక్కువసేపు మాట్లాడే అవకాశం దక్కింది. చరణ్ నుంచి నేను నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని అప్పుడే తెలుసుకున్నాను. అలా మా ఫ్రెండ్ షిప్ మొదలైంది. ఆ తర్వాత రెగ్యులర్ గా కలుసుకోవడం, హ్యాంగ్ అవుట్ అవ్వడం జరిగాయి. ఆర్ఆర్ఆర్ సెట్స్ పైకి వచ్చిన తర్వాత మా స్నేహబంధం మరింత పెరిగింది. ఏకంగా మూడేళ్లు కలిసి ట్రావెల్ చేయడంతో మరింత దగ్గరయ్యాం.”
చరణ్ తన ప్రతి పుట్టినరోజుకు ఎన్టీఆర్ ఇంటికి వస్తాడంట. అది కూడా అర్థరాత్రి 12 గంటలకు. అవును.. రాత్రి 12 గంటలకు ఎన్టీఆర్ ను తన కారులో ఎక్కించుకుంటాడట చరణ్. అలా ఇద్దరూ కలిసి చరణ్ పుట్టినరోజును నైట్ పార్టీతో సెలబ్రేట్ చేసుకుంటారట. కొన్నేళ్లుగా చరణ్ తన ప్రతి పుట్టినరోజుకు ఇలానే చేస్తున్నాడని చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్..ఇక ఆర్ఆర్ఆర్ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కనిపించరట. సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకే తమను అంతా మరిచిపోతారని, రామ్-భీమ్ పాత్రలకు కనెక్ట్ అయిపోతారని చెబుతున్నాడు తారక్.