in

Jr NTR out, Allu Arjun in again for Trivikram’s mythological film?

న్టీఆర్‌, అల్లు అర్జున్ తో మ్యూజిక‌ల్ ఛైర్ ఆట ఆడుతున్నాడు త్రివిక్ర‌మ్‌. అల్లు అర్జున్ కోసం త్రివిక్రమ్ ఓ మైథ‌లాజిక‌ల్ క‌థని సిద్ధం చేసుకొన్నాడు. అయితే ఎందుక‌నో ఆ ప్రాజెక్ట్ సెట్ అవ్వ‌లేదు. దాంతో ఈ క‌థని ఎన్టీఆర్ ద‌గ్గ‌రకు తీసుకెళ్లాడు. ప్ర‌శాంత్ నీల్ సినిమా ముగిసిన వెంట‌నే, ఈ సినిమా మొద‌లైపోతుంద‌ని అనుకొన్నారు. అయితే ఇప్పుడు ఈ క‌థ మ‌ళ్లీ బ‌న్నీ చెంత‌కు చేరింద‌ని తెలుస్తోంది..

వెంక‌టేష్ సినిమా ముగిసిన వెంట‌నే బ‌న్నీతో త్రివిక్ర‌మ్ ఈ సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అట్లీతో ఓ సినిమా చేస్తున్నాడు బ‌న్నీ. ఈ సమ్మ‌ర్‌కి ఈ సినిమా పూర్త‌వుతుంది. ఆ త‌ర‌వాత బ‌న్నీ ఎవ‌రితో జ‌ట్టు క‌డ‌తాడు? అనే విషయంలో అభిమానుల‌కు చాలా సందేహాలు ఉన్నాయి. బోయ‌పాటి శ్రీ‌ను, లోకేష్ క‌న‌గ‌రాజ్ లాంటి పేర్లు గ‌ట్టిగా వినిపించాయి. త్రివిక్ర‌మ్ – బ‌న్నీ కాంబో ఈలోగా సెట్ అవుతుంద‌ని ఎవరూ అనుకోలేదు. ఇప్పుడు స‌డ‌న్ గా త్రివిక్ర‌మ్ మ‌ళ్లీ లైన్‌లోకి రావ‌డం షాకింగ్ అంశ‌మే..!!

Champion!

Nandamuri Balakrishna and Koratala Siva to Team Up Soon?