జిక్కి, మనసుకు హాయిని గొలిపే, మధురమయిన ప్రత్యేక గాత్రం, ఈ పాట జిక్కి పాడితెనె బావుంటుంది అనే విధంగా ఉండే వాయిస్ ఆమెది. ఆమె అసలు పేరు పిల్లవాలు గజపతి కృష్ణవేణి, బాల నటిగా సినీ రంగ ప్రవేశం చేసి గాయనిగా స్థిరపడి దాదాపుగా పది వేల పాటలు పాడిన జిక్కి గారు. అప్పటి మధుర గాయకుడు, సంగీత దర్శకుడు అయిన ఏ.ఏం.రాజా గారిని వివాహం చేసుకున్నారు, ఆయన సంగీత దర్శకత్వంలో కూడా ఎన్నో పాటలు పాడారు, సినీ పరిశ్రమలోని లౌక్యం తెలియని ముక్కుసూటి తరహా మెంటాలిటీ వలన, సినీ పరిశ్రమకు దూరం అయ్యారు ఏం.ఏం.రాజా, ఆ తరువాతి కాలంలో పూర్తి కచేరీలకే పరిమితం అయ్యారు, ఇద్దరు. వివాహానికి ముందు ఆమె మీద కుటుంబ భారం మొత్తం ఉండేది..
అప్పట్లో అక్కినేని నాగేశ్వర రావు గారిని వివాహం చేసుకోమని సంబంధం వచ్చిందట, కానీ ఆమెకు ఉన్న బాధ్యతల వలన ఆ ప్రపోసల్ ని ఆమె ఉపయోగించుకో లేక పోయారట. మనం ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలంచాడు అనటానికి నిదర్శనం ఈ సంఘటన. అక్కినేని గారికి, జిక్కి గారికి, ఇద్దరికీ కార్ లు అంటే విపరీతమయిన ఇష్టం ఉండేది, ఇద్దరు పోటీ పడి మరి కార్లు కొనే వారట. ఆ తరువాత అక్కినేని గారు అన్నపూర్ణమ్మ గారిని వివాహమాడారు. ఆ తరువాతి జీవన క్రమంలో ఏం.రాజా. గారి సంగీత దర్శకత్వం లో పాటలు పాడుతున్నపుడు, పాటల పేపర్ మీద, ప్రేమ సందేశం వ్రాసి, ఇంట్లో వారి అనుమతితో జిక్కి గారిని ఏ.ఏం.రాజా వివాహం ఆడటం జరిగింది..!!