అందరికి నమస్కారం. ముందుగా నన్ను ఇంతలా స్వాగతించి నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న తెలుగు ఆడియన్స్‌కు, నన్ను జానూ పాప అని పిలుస్తున్న ఎన్టీఆర్ అభిమానులకు నా కృతజ్క్షతలు. నన్ను మీరు సొంత మనిషిలా ఫీలవ్వడం చాలా హ్యపీగా వుంది. మా అమ్మ మీకు ఎంత ముఖ్యమో నాకు తెలుసు. నాకు కూడా మీరు అంతే ముఖ్యం. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్న మీరందరూ గర్వపడేలా ప్రతి రోజు కష్టపడతాను.
దేవర నా తొలి అడుగు . దర్శకుడు శివ, ఎన్టీఆర్‌లు నన్నుఈ సినిమాకు హీరోయిన్‌గా సెలక్ట్ చేయడం నా అదృష్టం. నా తొలిప్రయత్నం మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను..నాకు సహకరించిన దేవర టీమ్ అందరికీ నా ధన్యవాదాలు. నేను ఈ మాటలన్నీ కూడా ప్రీరిలీజ్ వేడుకలో చెప్పాలనుకున్నాను కానీ కుదరలేదు. త్వరలోనే మిమ్ములను కలుస్తాను’ అని జాన్వీకపూర్ వీడియోలో సందేశం పంపారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా రూపొందిన దేవర చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది..!!