in

jhanvi kapoor was not the first choice for jr ntr devara!

సినిమాలో ఎన్టీఆర్‌కు జోడిగా జాన్వీకపూర్ నటించింది. జాన్వీ తొలి తెలుగు మూవీ ఇదే కావడం విశేషం. ఈ సినిమాలో పెద్దగా నటను ప్రాధాన్యత లేకపోయినప్పటికీ తన అందంతో కుర్రకారు హృదయాలను కొల్లగొట్టిందీ చిన్నది. ముఖ్యంగా చుట్టమల్లే చుట్టేసింది పాటతో మెస్మరైజ్‌ చేసింది. ఈ పాటలో జాన్వీని చూసిన కుర్రాళ్లు ఫిదా అయ్యారు. ఇదిలా ఉంటే దేవర మూవీలో హీరోయిన్‌గా తొలి ఆప్షన్‌ జాన్వీ కాదని మీలో ఎంత మందికి తెలుసు?

అవును తొలుత జాన్వీ స్థానంలో మరో హీరోయిన్‌ను అనుకున్నారంటా. అయితే చివరి క్షణంలో ఈ అవకాశం జాన్వీని వరించిందని సమాచారం. నిజానికి కొరటాల శివ తొలుత ఈ పాత్ర కోసం నేషనల్ క్రష్‌ రష్మికను అనుకున్నారంటా. అయితే అప్పటికే సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక.. దేవర చిత్రానికి డేస్ట్‌ అడ్జెస్ట్ చేయలేకపోయింది. దీంతో రష్మిక ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి. దేవర చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించిన కారణంగానే రష్మికను తీసుకోవాలని ప్లాన్‌ చేశారంటా..!!

test your knowledge about Tollywood – quiz 1

Is Keerthy Suresh Planning to Quit Films After Marriage?