సోషల్ మీడియా వేదికగా జాన్వి గ్లామర్ ఫోటోస్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. దీంతో ఈ అమ్మకి బోల్డ్ హీరోయిన్ గా మంచి ఇమేజ్ వచ్చింది. అప్పుడప్పుడు పొట్టి డ్రస్సులతో పార్టీలో సందడి చేసే జాన్వి..నెటింట ట్రోలింగ్స్‌కు కూడా గురవుతుంది. అయితే తాజాగా ఆమె గ్లామర్ గురించి..కండోమ్ సంస్థ అధినేత చేసిన కామెంట్స్ వివాదాలకు దారి తీసాయి..
ఆయన జాన్వీ కపూర్‌ను ఉద్దేశిస్తూ..అసభ్యకరంగా మాట్లాడడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాన్ ఫోర్ సంస్థ ఫౌండర్ రాజీవ్ జునేజ..ఓ ఇంటర్వ్యూలో జాన్వి గురించి వెల్లడించాడు. కండోమ్ బ్రాండ్ కు సినీ తారలు, మోడల్స్ యాడ్ చేయడం సహజమే. కానీ రాజీవ్..జాన్వి కపూర్ అనుమతి లేకుండా ఆమె పేరును ప్రస్తావిస్తూ తమ బ్రాండ్ కండోమ్స్ యాడ్‌ని జాన్వి కపూర్ చేయడం బెస్ట్ ఛాయిస్ అని చెప్పుకొచ్చాడు. ఆయన ఉద్దేశం జాన్వీ కు శృంగారపరమైన ఇమేజ్ను ఆపాదించడమే అంటూ ఇన్ డైరెక్ట్‌గా జాన్వి అలాంటి వాటికే పనికొస్తుందంటూ కామెంట్స్ చేశాడని మండిపడుతున్నారు.