in

JAYASUDHA NU IRAKATAM LO PETTINA PRODUCER!

య సుధ కెరీర్ ప్రారంభ దశలో నటించిన “జ్యోతి” అనే చిత్రం లో నిర్మాత క్రాంతి కుమార్ గారు, డైరెక్టర్ రాఘవేంద్ర రావు జయ సుధ గారిని ఇరకాటం లో పెట్టారు. జ్యోతి అనే టీన్ యేజర్ ముసలివాడైనా గుమ్మడి గారిని వివాహం చేసుకుంటుంది, అంత చిన్న పిల్ల ముసలివాడిని ఎందుకు పెళ్లి చేసుకుంది, దానికి కారణాలు ఏమిటి అనేదే సినిమా. నిర్మాత క్రాంతి కుమార్ గారు సినిమా మేకింగ్ లో చాల ఇంవోల్వ్ అవుతారు, డైరెక్టర్స్ ని ఇబ్బంది పెడతారు అనే పేరు ఉండేది. జ్యోతి చిత్రం లో జయ సుధ గారు ముసలి వాడయినా గుమ్మడి గారికి ప్రపోస్ చేసే సీన్ ప్లాన్ చేసారు, షూటింగ్ వరంగల్ లో జరుగుతుంది. ఆ సీన్ లో జయసుధను లంగా, ఓణీ వేసుకొని రమ్మని చెప్పారట రాఘవేంద్ర రావు, డైరెక్టర్ చెప్పిన విధం గ డ్రెస్ అయి వచ్చిన జయసుధను చూడగానే క్రాంతి కుమార్ గారు ఇదేమిటి పెళ్లి ప్రపోస్ చేసే అమ్మాయి లంగా, ఓణీ ఏమిటి? చీర కట్టుకొని, పెద్ద బొట్టు పెట్టుకో అన్నారట. పాపం జయ సుధ గారు ఆయన చెప్పినట్లు గానే డ్రెస్ చేసుకొని స్పాట్ కి వెళ్లారట ఆమెను చూడగానే రాఘవేంద్ర రావు గారు కళ్ళ జోడు తీసి కోపంగా నేలకేసి కొట్టారట, నేను చెప్పిందేమిటి నువ్వు చేసింది ఏమిటి అంటూ చిందులు వేసారట.

దెబ్బకు బిక్క చచ్చిన జయ సుధ గారు క్రాంతి కుమార్ గారు చెప్పారు సర్ అని సమాధానం చెప్పారట. వెంటనే రాఘవేంద్ర రావు గారు, క్రాంతి కుమార్ గారి దగ్గరకు వెళ్లి, ఒక టీన్ ఏజ్ పిల్ల ముసలి వాడికి ప్రపోస్ చేస్తున్నది అనే విషయాన్ని ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా తీయాలి అంటే జయ సుధ లంగా, ఓణీ లోనే ఉండాలి, ఇలా చీర కట్టులో కాదు అని చెప్పిన తరువాత, అలాగే కానివ్వండి అన్నారట క్రాంతి కుమార్ గారు. మళ్ళీ వెంటనే జయ సుధ గారు డ్రెస్ మార్చుకొని ఆ షాట్ లో ఆక్ట్ చేశారట.ఇలా ప్రతి విషయం లో డైరెక్టర్ ని, నటి, నటులను ఇబ్బంది పెట్టేవారట క్రాంతి కుమార్ గారు, అప్పట్లో ప్రొడ్యూసర్ ఇస్ ది బాస్ కాబట్టి నడిచింది, ఇప్పుడయితే ప్రొడ్యూసర్ లొకేషన్ కి రావలసిన అవసరం లేదు, అని ముందే కండీషన్ పెట్టి సినిమా చేస్తున్న డైరెక్టర్ లు చాల మందే ఉన్నారు, అప్పుడు మంచి చిత్రాలు వచ్చాయి, ఇప్పుడు కూడా మంచి చిత్రాలు వస్తున్నాయి. సో అప్పుడది కరెక్ట్ అయితే , ఇప్పటికే ఇదే కరెక్ట్.

kapilakshi malhotra sets the internet on fire!

Actress Suhasini comments on Hindi language issue!