శోభన్ బాబు గారి సలహాను నెగ్లెక్ట్ చేసిన జయసుధ.శోభన్ బాబు గారు విలక్షణమయిన నటుడే కాదు, మంచి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్న వ్యక్తి. నటుడిగా ఆయన సంపాదన మొత్తం వివిధ ప్రాంతాలలో భూమి కొనటం ద్వారా తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత ధనవంతుఁడయిన హీరోగా పేరు గడించారు. శోభన్ బాబు గారి బాటలోనే నడిచిన సహా నటులు చంద్ర మోహన్, మురళి మోహన్ కూడా ఎంతో సంపన్నులు అయ్యారు. శోభన్ బాబు గారు తన సహచర నటి నటులకు ఎక్కడ భూమి కొంటె మంచిది, ఎక్కడ భూమి తక్కువ రేట్ కు దొరుకుతుంది అని సలహాలు, సూచనలు చెపుతూ ఉండేవారు.డబ్బు వృధా చేయకుండా భూమి కొనుక్కోండి అవసరానికి పనికి వస్తుంది అని అందరికి చెపుతూ ఉండేవారు. అదే క్రమంలో ఒక రోజు ఏదో షూటింగ్ నుంచి తిరిగి వస్తున్నా సమయంలో జయసుధ గారికి ఒక ప్లేస్ చూపించి…
“ఏమోయ్ మీ నాన్న గారికి చెప్పి ఇక్కడ స్థలం కొనుక్కో, ఫ్యూచర్ లో మంచి రేట్ వస్తుంది” అని చెప్పారట, మరుసటి రోజు ఆ స్థలం చూస్తే అది ఒక డంపింగ్ యార్డ్, ఇదేమిటి ఈ స్థలం కొనమని చెప్పారు అని శోభన్ బాబు గారిని అడిగితే. “అవునోయ్ ల్యాండ్ లెవెలింగ్ కోసం మట్టిని డంప్ చేస్తున్నారు ఏమి డౌట్ లేకుండా ఆ ల్యాండ్ కొనుక్కోమని” చెప్పారట. అయినా జయసుధ కు నమ్మకం కలగక దానిని వదిలేసారు. ఆ డంపింగ్ యార్డ్ వంటి స్థలమే ఇప్పుడు , చెన్నై లో అత్యంత ఖరీదయిన అన్నా నగర్ ప్రాంతం. ఆ ప్రాంతం లో స్థలం ఉంటె ఒక వంద కోట్లు బ్యాంకు లో ఉన్నట్లే. ఆ విధం గ శోభన్ బాబు గారి సలహా లైట్ గ తీసుకున్న విషయం జయసుధ గారే స్వయంగా వెల్లడించారు.అందుకేనేమో, దేనికయినా రాసి పెట్టి ఉండాలి అంటారు పెద్దలు..