జయప్రద మీద అలిగిన డైరెక్టర్ బాలచందర్, ఎందుకు, ఏమిటి? 1974 లో “భూమి కోసం” అనే చిత్రంలో చిన్న పాత్రతో సినీ రంగ ప్రవేశం చేసిన జయప్రద గారు, 1975 బాలచందర్ గారి డైరెక్షన్ లో వచ్చిన తోలి తెలుగు సినిమా అయిన ” అంతులేని కధ” చిత్రం లో సరిత పాత్ర తో తిరుగులేని హీరోయిన్ గ ఎదిగారు. ఈ చిత్రం తరువాత తెలుగులో వరుసగా అవకాశాలు ఆమె ముంగిట్లో వాలాయి. చెన్నై లో జరిగిన “అంతులేని కధ” చిత్రం శత దినోత్సవ సభ కు జయప్రద గారు రాలేదు, ఈ సంఘటనతో బాలచందర్ గారు చాల అప్సెట్ అయ్యారు, ఫంక్షన్ లో అయన మాట్లాడుతూ ఈ చిత్ర హీరోయిన్ చాల పెద్దది అయిపొయింది, యెంత పెద్దది అంటే, తాను నటించిన చిత్రం విజయోత్సవం లో పాలుగోలేనంత, అంటూ ఆయన కోపాన్ని వ్యక్తీకరించారు.
నేను ఎవరి కోసమో ఆగే రకం కాదు, అవసరం అయితే ఇంకో హీరొయిన్ ని తయారు చేస్తాను అంటూ చాల తీవ్రంగా స్పందించారు. జయప్రద గారు యెన్.టి.ఆర్. నిర్మిస్తున్న చాణిక్య చంద్ర గుప్త షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లారు, ఆమె మూడు గంటల ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకున్నారు, ఫంక్షన్ విషయం చెప్పి యెన్.టి.ఆర్. వద్ద పర్మిషన్ తీసుకున్నారు కానీ ఆ ఫ్లైట్ కాన్సల్ అవటం తో రాత్రి కి బయలు దేరి వచ్చారు, ఆమె వచ్చే సరికి ఫంక్షన్ పూర్తి అయిపొయింది. ఆ తరువాత జయ ప్రద గారు బాలచందర్ గారిని కలసి విషయం చెప్పాలని ఎంత ప్రయత్నించినా ఆయన అప్పోయింట్మెంట్ దొరకలేదు. ఈ ప్రతిష్టంభన సుమారు రెండు సంవత్సరాలు నడించింది, చివరకు విషయం తెలుసుకున్న బాలచందర్ గారు, ఆమె కు మళ్ళి “అందమైన అనుభవం” చిత్రంలో అవకాశం ఇచ్చారు, కమల్, రజని తో కలసి ఈ చిత్రంలో నటించారు జయ ప్రద గారు..