in

Jaya Krishna Ghattamaneni, grandson of Krishna makes his debut!

ట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో పరిచయం అవుతున్నాడు. సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయ కృష్ణ ఘట్టమనేని హీరోగా నటిస్తున్న మొదటి చిత్రం “శ్రీనివాస మంగాపురం”. ఈ సినిమా నుంచి అతని మొదటి లుక్ ఈ రోజు విడుదలైంది. RX 100, మంగళవారం వంటి సినిమాలు తీసిన అజయ్ భూపతి ఈ సినిమాకి దర్శకుడు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్‌ అశ్విని దత్ సమర్పిస్తున్నారు. చందమామ కథలు బ్యానర్ పై పి. కిరణ్ నిర్మిస్తున్నారు.

ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు తన అన్న కొడుకైన జయకృష్ణ ఫస్ట్ లుక్‌ను లాంచ్ చేశారు. ఫస్ట్ లుక్‌లో జయ కృష్ణ దుమ్ము దూళి ఎగసే బ్యాక్ డ్రాప్ లో హై స్పీడ్‌లో బైక్ నడుపుతూ కనిపించారు. ఒక చేత్తో బైక్‌ను గట్టిగా పట్టుకుని, మరో చేత్తో గన్ టార్గెట్ గా పెట్టిన విధానం చూస్తుంటే ఇది యాక్షన్ సినిమా అనిపిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి రాషా తడాని టాలీవుడ్ అరంగేట్రం చేస్తున్నారు. ఆమె రవీనా తాండన్ కూతురు..!!

veteran actress jayasudha about casting couch!