in

Janhvi Kapoor To Star In Mother Sridevi’s Chaalbaaz Remake?

తిలోక సుందరి శ్రీదేవి కెరీర్‌లోని మరపురాని చిత్రాల్లో ‘చాల్‌బాజ్‌’ ఒకటి. 1989లో వచ్చిన ఈ సినిమాలో ఆమె ద్విపాత్రాభినయం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఇదే క్లాసిక్ సినిమా రీమేక్‌లో శ్రీదేవి కుమార్తె, యువ కథానాయిక జాన్వీ కపూర్ నటించనున్నారనే వార్త బాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. తన తల్లి పోషించిన ఐకానిక్ పాత్రను పోషించేందుకు జాన్వీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది..

తన తల్లి శ్రీదేవి నటించిన చిత్రాలంటే తనకు ఎంతో ఇష్టమని, అవి తనకో ఎమోషన్ అని జాన్వీ పలు సందర్భాల్లో చెప్పారు. ఈ క్రమంలో, ఆమెకు బాగా నచ్చిన సినిమాల్లో ఒకటైన ‘చాల్‌బాజ్‌’ రీమేక్‌లో నటించే అవకాశాన్ని ఒక సవాలుగా తీసుకున్నారని బాలీవుడ్ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పాత్ర కోసం జాన్వీ ఇప్పటికే ప్రత్యేకంగా గ్రౌండ్ వర్క్ కూడా మొదలుపెట్టారని సమాచారం. ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారని, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ సెప్టెంబర్ నెలాఖరులో వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది..!!

Teja sajja Clarifies about Mahesh Babu’s Lord Rama role!