in

Janhvi Kapoor says she wants to do every film with Jr NTR!

దేవర సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకప్పుడు సంవత్సరాల పాటు తెలుగు సినీ పరిశ్రమలో  అగ్ర కథానాయికగా వెలుగొందిన శ్రీదేవి కూతురిగా టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ముంబైలో జరిగింది. జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన అనుభవాలను ఆమె పంచుకున్నారు..

తెలుగు ఇండస్ట్రీకి వెళుతుంటే తనకు సొంత ఇంటికి వెళుతున్నట్టు అనిపిస్తోందని జాన్వీ కపూర్ చెప్పారు. ఇది తనకు చాలా ప్రత్యేకమైన మూవీ అని అన్నారు. ఎన్టీఆర్‌కు తాను అతిపెద్ద ఫ్యాన్ అయ్యానని జాన్వీ కపూర్ అన్నారు. “ఎన్టీఆర్‌తో నేను ప్రతీ సినిమా చేయాలని అనుకుంటున్నా. చాలా సరదాగా అనిపించింది. నేను ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. నేను అంతకు ముందే ఆయనకు అభిమానిని. ఆయనతో కలిసి నటించాక చాలా పెద్ద ఫ్యాన్ అయ్యా” అని జాన్వీ కపూర్ అన్నారు..!!

nithya menon: i am not a Malayali

Mahesh Babu invests in nutrition startup Fitday!