బాలీవుడ్ యువ నటి జాన్వీ కపూర్ తన తాజా చిత్రం ‘పరమ్ సుందరి’ విషయంలో ఎదురవుతున్న విమర్శలపై స్పందించారు. కేరళ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో మలయాళీ యువతి పాత్రలో ఉత్తరాదికి చెందిన జాన్వీ నటించడంపై సోషల్ మీడియాలో కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రోల్స్‌కు ఆమె తనదైన శైలిలో సమాధానమిచ్చారు. ఈ క్రమంలో తన తల్లి, దివంగత నటి శ్రీదేవిని గుర్తుచేసుకున్నారు..
‘పరమ్ సుందరి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ, “నేను మలయాళీ అమ్మాయిని కాదన్నది నిజమే. కానీ మా అమ్మ శ్రీదేవి కూడా మలయాళీ కాదు. అయినప్పటికీ ఆమె దక్షిణాది చిత్రాల్లో ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. నాకు కేరళ సంస్కృతి అంటే ఎంతో ఇష్టం, మలయాళ సినిమాలకు నేను పెద్ద అభిమానిని” అని తెలిపారు. ఈ సినిమాలో తాను కేవలం మలయాళీగానే కాకుండా, తమిళ యువతిగా కూడా కనిపిస్తానని ఆమె స్పష్టం చేశారు. ఇది కేవలం వినోదం కోసం తీసిన చిత్రమని, ఇందులో భాగం కావడం సంతోషంగా ఉందని అన్నారు..!!