in

Janhvi Kapoor gets a special gift from Ram Charan’s wife Upasana!

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ఈ సినిమా లొకేషన్ లో ఉపాసన సర్ ప్రైజ్ చేసినట్టు తెలుస్తుంది. బిజినెస్ ఉమెన్ గా సత్తా చాటుతూ ఎంతోమంది మహిళలకు స్పూర్తిగా నిలుస్తున్న ఉపాసన అప్పుడప్పుడు ఇలా చరణ్ సినిమా సెట్స్ కి వచ్చి సందడి చేస్తుంటారు. RC 16 సెట్స్ లో కూడా ఉపాసన ఎంట్రీ చిత్ర యూనిట్ ని సర్ ప్రైజ్ చేసింది.

ఇక షూటింగ్ స్పాట్ లో జాన్వి కపూర్ తో కాసేపు సరదాగా ఉపాసన ముచ్చటించారు. దానికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు ఉపాసన జాన్వి కపూర్ కి అత్తమ కిచెన్ నుంచి ఒక స్పెషల్ గిఫ్ట్ కూడా తెచ్చినట్టు అర్ధమవుతుంది. ఉపాసన, జాన్వి కపూర్ ఇద్దరు కలిసి దిగిన ఈ స్పెషల్ పిక్ మెగా ఫ్యాన్స్ ని ఖుషి చేస్తుంది. ఇక RC 16 సినిమా విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాను నెక్స్ట్ ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేసేలా యూనిట్ పనిచేస్తుంది..!!

Dilruba!