in

jandyala garu inka vari cinemalu!

జంధ్యాల వీర వెంకట దుర్గ శివ సుబ్రమణ్య శాస్త్రి ,ఎవరండీ ఇంత పెద్ద పేరు అని అనుకుంటున్నారా? జంధ్యాల అనే చిన్న పేరు తో సినిమాల్లో చాల పెద్ద పేరే సంపాదించారు ఆయన. రచయిత గ 350 చిత్రాలు, డైరెక్టర్ గ 39 చిత్రాలతో తెలుగు చిత్రాల మీద చెరగని ముద్ర వేశారు, జంధ్యాల గారు.వారికీ పాత సినిమాలు అన్న, పాత పాటలు అన్న యెనలేని మక్కువ, దానికి చక్కటి ఉదాహరణ , ఒక్క మాయ బజార్ చిత్రం పాటల పల్లవుల నుంచి , వారి 6 చిత్రాలకు పేర్లు పెట్టారు, బహుశా ఒక చిత్రం పాటల పల్లవులు ఇంత ఎక్కువ శాతం సినిమా టైటిల్స్ గ మారటం ఇదే మొదటిసారి, అది జంధ్యాల గారికి ఆ సినిమా మీద ఉన్న మక్కువకూ నిదర్శనం. ఆ టైటిల్స్ ఏమిటో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే చూడండీ. 1వివాహ భోజనంబు, 2 చూపులు కలసిన శుభవేళ 3 అహ నా పెళ్ళంటా 4 ఓహో నా పెళ్ళంటా 5 హాయ్ హాయ్ నాయక 6 బావ బావ పన్నీరు . నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అని నమ్మిన వారు, ఒక నవ్వుల యోగి గ అందరికి నవ్వులను పంచి, 50 సంవత్సరాల చిన్న వయసులోనే వారు అందరికి దుఖ్ఖన్ని పంచి వెళ్లి పోవటం విషాదకరం.

Upasana paternal grandfather dies!

trisha indirect satire on rana?