జానపద బ్రహ్మ విఠలాచార్య నోటి వాక్కు, బ్రహ్మ వాక్కు అయిన వేళ, విఠలాచార్య నిర్మాతగా, డైరెక్టరుగా అందరికి సుపరిచితులు, కానీ అయన మంచి జోతిష్కుడు కూడా. సినీ రంగం లోని కొందరు సన్నిహితులకు సరదాగా అయన జాతకాలు చెపుతూ ఉండేవారు. సినీ రంగం లో ఇటువంటివి కూడా జరుగుతుంటాయ? అంటే అవును జరుగుతాయి, అల్లు రామలింగయ్య గారు హోమియో వైద్యం చేసే వారు, రమణ రెడ్డి మ్యాజిక్కులు చేసే వారు, డాక్టర్ ప్రభాకర్ రెడ్డి సెట్లోకి ఏకంగా స్టెత్ తో వచ్చేవారు, కృష్ణం రాజు గారు జాండీస్ కి పసరు మందు ఇచ్చే వారు, యెన్.టి.ఆర్. బొమ్మలు వేసే వారు. ఈ క్రమం లోనే విఠలాచార్య హాబీ గ జాతకాలు చెప్తూ ఉండేవారు..
యెన్.టి.ఆర్. రాజకీయాలలోకి వెళతారని ఎన్నో సంవత్సరాల ముందే చెప్పారట విఠలాచార్య. ఒక సారి శ్రీదేవి నటనకు అబ్బురపడిన యెన్.టి.ఆర్. విఠలాచార్యను ఆమె చేయి చూసి ఆమె ఫ్యూచర్ చెప్పమని అడిగారట, వాస్తవానికి విఠలాచార్య అందరికి జాతకం చెప్పే వారు కాదు, యెన్.టి.ఆర్. అడిగారు కాబట్టి ఆమె చేయి చూసిన అయన, ” అబ్బో ఈమె ఈ దేశానికే హీరోయిన్ అయ్యేట్లుగా ఉందే” అన్నారట, ఆ తరువాత ఏమి జరిగిందో అందరికి తెలుసు. ఏదేమయిన అన్నగారు చూపించిన జాతకం నిజం అయిందని శ్రీదేవి స్వయంగా రెండు సందర్భాలలో ప్రస్తావించారు. ఇంకొక కొస మెరుపు ఏమిటంటే తన సినిమాలలో నటించే హీరోల జాతకం చూసిన తరువాతే వారిని తన సినిమాలోకి తీసుకొనేవారట విఠలాచార్య. “పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి” అంటారు పెద్దలు..