
త్వరలోనే పెళ్లి చేసుకుంటానని చెప్పేవాడు అవినాష్. గతంలో ఓసారి అవినాష్ పెళ్లి గెటప్‌లో ఉన్న ఫోటోను సైతం నెట్టింట్లో షేర్ చేయడంతో నిజంగానే అవినాష్ రహస్యంగా పెళ్లి చేసుకున్నాడంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఆ రూమర్లకు చెక్ పెడుతూ.. తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చాడు అవినాష్. అనూజ అనే అమ్మాయితో ఎంగెజ్మెంట్ జరిగినట్లుగా తెలిపాడు అవినాష్. ఎంగెజ్మెంట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఎక్కువ రోజులు వెయిట్ చేసిన తర్వాత సరైన వ్యక్తి మీ జీవితంలో వచ్చేస్తారు. మా రెండు కుటుంబాలు కలుసుకున్నాయి. అలాగే మేము కలుసుకున్నాము. మా నిశ్చితార్థం. మీరందరూ నన్ను చాలాసార్లు అడిగారు మీ పెళ్లి ఎప్పుడూ అని.. అతి త్వరలోనే నా అనూజతో.. ఇలాగే మీ ఆశీస్సులు మాకు ఉంటాయని కోరుకుంటూ మీ ముక్కు అవినాష్.. సారీ అనూజ అవినాష్ అంటూ పోస్ట్ చేశాడు అవినాష్..

