ఓఇష్యూ కోసం అమెరికా నుండి ఇండియా వచ్చిన మైరా హ్యాన్సన్ అనే ఎన్నారై పాత్ర పోషించాను. ఈ స్టోరీని నాకు ఫోన్‌లో చెప్పారు దేవ. రెగ్యులర్ సినిమా కాదిది. అందుకే రొమాంటిక్ ట్రాక్స్ ఉండవు. కానీ హీరో హీరోయిన్లిద్దరూ ఒకరినొకరు ఇష్డపడతారు. మెచ్యూర్డ్ లవ్ స్టోరీ. స్క్రిప్ట్‌తో పాటే సీన్స్ ట్రావెల్ అవుతాయి. చిన్న పాత్ర కూడా రిజిస్టర్ అయ్యేలా ఉంటుందీ సినిమా. సాయి తేజ్ చాలా ఎఫర్ట్ పెట్టాడు. పది నిముషాల కోర్ట్ సీన్‌ని సింగిల్ టేక్‌లో చేసేశాడు.
అంతలా ఆ పాత్ర కోసం ప్రిపేరయ్యాడు. తన కెరీర్‌లో ఇది బెస్ట్ మూవీ అవుతుంది. ఇక నా పార్ట్ షూటింగ్‌కి ఇరవై రెండు రోజులు పడితే, ఎన్నారైగా అమెరికన్ యాక్సెంట్‌లో డబ్బింగ్ చెప్పడానికి పదిహేను రోజులు పట్టింది. దేవ పర్ఫెక్షనిస్ట్. అస్సలు కాంప్రమైజ్ కారు. సినిమా ఇన్‌ఫ్లుయెన్స్ జనాలపై చాలా ఉంటుంది కనుక వారిని ఎడ్యుకేట్ చేసేలా తీశారు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాల్సిన సినిమా ఇది. బేసిగ్గా నాకు సౌందర్య, సమంత, అనుష్కల నటనంటే ఇష్టం.
గ్లామర్‌తో పాటు, పెర్ఫార్మెన్స్ రోల్స్ కూడా చేశారు వాళ్లు. నేను పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ ఈజీగా చేస్తాను కానీ గ్లామర్ రోల్స్ చేయలేను. చిన్నదైనా పర్లేదు కానీ అది అందరికీ గుర్తుండిపోయే పాత్ర అయి ఉండాలనుకుంటాను. తమిళంలో కమర్షియల్ కంటే రియలిస్టిక్ సినిమాలే ఎక్కువ చేశాను. ఇప్పుడు ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ ఎక్కువగా చేస్తున్నాను. తెలుగులో ఇప్పుడే కెరీర్ మొదలైంది కనుక అప్పుడే ఫిమేల్ సెంట్రిక్ మూవీస్ చేయలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ‘గతం’ దర్శకుడు కిరణ్ రెడ్డి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్పారు.