హిట్లు, ఫట్లతో సంబంధం లేకుండా దర్శకుడు పూరి జగన్నాథ్ సినిమాలను అభిమానించే సినీ ప్రియులు ఎంతో మంది ఉన్నారు. ఆయన సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి విడుదలయ్యేంత వరకు అభిమానులు ఎదురు చూస్తుంటారు. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు ఫ్లాప్ అయిన తర్వాత ఆయన సినిమాల గురించి ఎలాంటి అప్డేట్ రాలేదు. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ లో జోష్ నింపే అప్డేడ్ వచ్చింది. తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి.
ఆ వార్తలు నిజమయ్యాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేడ్ ఇప్పుడు వచ్చింది. విజయ్ సేతుపతితో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రొడక్షన్ హౌస్ ‘పూరి కనెక్ట్స్’ ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..!!