నిత్యా మీనన్ వెండితెరపై కనిపించి రెండేళ్లయింది. తాజాగా పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమాతో ఆమె టాలీవుడ్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నది. పవన్‌కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ కు రీమేక్ ఇది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లేతో పాటు సంభాషణల్ని సమకూర్చుతున్నారు.
ఈ సినిమాలో కథానాయికగా నిత్యామీనన్‌ను ఎంపిక చేశారు. ఆమెకు స్వాగతం పలుకుతూ చిత్రబృందం శుక్రవారం కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్ భార్యగా నిత్యామీనన్ కనిపించబోతున్నట్లు సమాచారం. అభినయప్రధానంగా ఆమె పాత్ర సాగుతుందని తెలిసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతోంది. పోలీస్ స్టేషన్ సెట్‌లో పవన్‌కల్యాణ్, రానాలపై కీలక సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. ఐశ్వర్యరాజేష్ మరో నాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.