in

its official: Nayanthara joins the empire of ‘NBK111’

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఇప్పుడు అఖండ 2 తాండవం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత తన కెరీర్ లో 111 వ సినిమాని దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన సినిమా మొదలైంది. ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ నేడు ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని హీరోయిన్ గా ఎవరు చేస్తారు అనేది రివీల్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ అప్డేట్ ఓ సాలిడ్ అనౌన్సమెంట్ వీడియోతో రివీల్ అయ్యింది.

దీనితో ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార బాలయ్య సరసన నటిస్తున్నట్టుగా రివీల్ చేశారు. ఇక ఇందులో విజువల్స్ చూస్తుంటే ఒక హిస్టారికల్ సినిమా తరహాలో కనిపిస్తున్నాయి. మరి గోపీచంద్ ఈసారి బాలయ్యతో ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి. ఇక బాలయ్యతో నయనతార సింహా, శ్రీరామ రాజ్యం, జై సింహా మూడు సినిమాలు నటించిన తర్వాత నాలుగోసారి జంటగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రంకి థమన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు..!!

Aditi Rao Hydari breaks silence on WhatsApp scam!