సినిమా ఫీల్డ్ లో ఉన్న వారికి రిలేషన్ చేసుకోవడం..అంతే త్వరగా విడిపోవడం చాలా సాధారణంగా జరిగే విషయం..ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎవరు ఊహించని మోస్ట్ షాకింగ్ అండ్ డిస్సపాయింట్ బ్రేకప్ అంటే నాగ చైతన్య – సమంత వాళ్లదే అనే చెప్పాలి..ఎంతో క్యూట్ గ..లవ్లీ పెయిర్..అని అందరు అనుకుంటున్నా సమయంలో ఒక్కసారిగా విడిపోతున్నాం అనే వార్త రావడంతో ఆటు అక్కినేని ఫ్యాన్స్ ఏ కాకుండా తెలుగు వారంతా షాక్ కు గురయ్యారు..పెళ్లైన నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకోవడం అభిమానులకి ఏ మాత్రం నచ్చలేదు. వారిద్దరు తిరిగి కలిస్తే బాగుండని చాలా మంది అనుకున్నారు కూడా..
it’s official Naga Chaitanya, Sobhita Dhulipala are engaged!
అయితే అది నిజం అయ్యే ఛాన్స్ ఇప్పుడు ఇక లేదు..ఎందుకంటె చైతన్య మరో పెళ్లి కు రెడీ అయ్యాడు..సమంత నుండి విడిపోయిన తర్వాత శోభితతో ప్రేమలో ఉన్నాడని త్వరలో వారిద్దరి వివాహం జరగనుందని జోరుగా ప్రచారం నడించింది ఇన్నాళ్లు..ఈ విషయాన్ని తండ్రి కింగ్ నాగార్జున ఆఫీసియల్ గ ప్రకటించారు. కాసేపటి క్రీతం చైతన్య శోభిత కు నిశ్చితార్థం జరిగిందని ఆయన తెలిపారు. ఆమెను తమ కుటుంబంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నామని నాగార్జున అన్నారు. అలాగే ఈ ప్రేమ, సంతోషం జీవితాంతం కొనసాగాలని ఆకాంక్షించారు. ‘8.8.8’. హద్దులేని ప్రేమకు నాంది ఈ రోజు మొదలైందని అన్నారు..నిశ్చితార్థం ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్ గా జరిగినట్లు అర్ధం అవుతుంది..మొత్తానికి చైతు ఇంటివాడు అయ్యాడు..మరి సమంత ఏం చేస్తుందో వేచి చూడాలి..!!