in

it’s official, Anupam Kher joins Prabhas’ ‘Fauji’!

రెబల్ స్టార్ ప్రభాస్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి కాంబినేషన్ లో ఒక సినిమా వస్తున్న విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా ఆజాద్ హింద్ ఫౌజీ నాటి కథతో వస్తున్నారని టాక్. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుంది..

సినిమాకు ఫౌజీ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఐతే చిత్ర యూనిట్ టైటిల్ విషయంలో ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు. ఇదిలాఉంటే లేటెస్ట్ గా ఈ సినిమాలో బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నట్టు తెలుస్తుంది. స్వయంగా అనుపమ్ ఖేర్ తన సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. సినిమాలో భాగం అవుతున్నందుకు సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు అనుపమ్ ఖేర్..!!

lonely samantha shares interesting post again!

Laila Overall review!