
అఖండ 2’ సస్పెన్స్ వీడింది..రిలీజ్ డేట్ ఖాయం అయ్యింది. అంతా అనుకొన్నట్టుగానే డిసెంబరు 12న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు. 11న ప్రీమియర్లు ప్రదర్శించబోతున్నారు. ‘అఖండ 2’ విడుదలకు లైన్ క్లియర్ చేస్తూ చెన్నై కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఫైనాన్షియర్లు కూడా రాజీకి రావడంతో పరిస్థితి నిర్మాతల చేతుల్లోకి వచ్చింది. దాంతో రిలీజ్ గ్రహణం దాటగలిగింది. ఈరోస్ సంస్థకు దాదాపు రూ.27 కోట్ల వరకూ 14 రీల్స్ చెల్లించాల్సివుంది. చివరికి 15 కోట్లకు రాజీ కుదిరిందని సమాచారం అందుతోంది. లోకల్ ఫైనార్షియర్లు కూడా కాస్త వెనక్కి తగ్గడంతో గండాలన్నీ దాటగలిగింది అఖండ 2. ఏపీ, తెలంగాణలలో 11 రాత్రి 9 గంటల నుంచి ప్రీమియర్లు ప్రదర్శించే ఛాన్స్ వుంది.!!

