సోషల్ మీడియాలో విజయ్, రష్మికల గురించి రకరకాలుగా మాట్లాడుతుంటారు. ఐతే ఇదే క్రమంలో టాలీవుడ్ లో మరో హీరో, హీరోయిన్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా టైంలో ఇద్దరు ఇష్టపడ్డారని.. వాళ్లిద్దరు ప్రేమలో ఉన్నారని ఫిల్మ్ నగర్ టాక్.
ఇక లేటెస్ట్ గా రామ్ ఒక ఫోటో షేర్ చేయగా..భాగ్య మరో ఫోటో షేర్ చేసింది. ఐతే ఆ ఫోటోలు చూస్తే ఇద్దరు ఒకే హోటల్ లో ఉన్నట్టు ఉంది. విజయ్, రష్మిక లానే ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తుంది అంటూ వార్తలు మొదలు పెట్టారు. ఇప్పుడే కాదు గత నెల రోజులుగా రామ్, భాగ్య శ్రీ లవ్ స్టోరీ అంటూ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీరి మధ్య ఉన్నది నిజంగా ప్రేమేనా లేదా అన్నది తెలియాల్సి ఉంది..!!