సాలూరి రాజేశ్వర రావు గారు విద్వత్తు కు పెద్ద పీట వేసే వారు, ఆయన సంగీత దర్శకుడు, నేపధ్య గాయకుడు, అయినా కూడా ఇతర కళాకారులకు చాల గౌరవం ఇచ్చేవారు. రాజేశ్వర రావు గారు సంగీత దర్శకత్వం వహించిన భక్త ప్రహళ్లాద చిత్రంలో, మంగళంపల్లి బాల మురళి కృష్ణ గారు నారద పాత్ర పోషించారు. నారద పాత్రకు సంబంధించిన పాటలు ట్యూన్ చేయవలసి వచ్చినపుడు, అంతటి మహానుభావుడి పాటలు నేను ట్యూన్ చేయటం ఏమిటి, లిరిక్ ఇస్తే వారే ట్యూన్ చేసి, వారే పాడుకుంటారు అంటూ,
బాల మురళి కృష్ణ గారి మీద ఆయనకు ఉన్న గౌరవాన్ని చాటుకున్నారు. రాజేశ్వర రావు గారు స్వతహాగా మంచి గాయకుడు, అప్పట్లో ఎవరయినా హీరోలకు నేపధ్య గానం చేయమని అడిగితే ఘంటసాల గారు ఉండగా నేను పాడటం ఏమిటి తప్పు! అంటూ సున్నితం గ తిరస్కరించేవారు. ఎవరయినా మరి బలవంతం చేస్తే ఏదయిన బ్యాక్ గ్రౌండ్ సోలో సాంగ్ ఉంటె పాడే వారే తప్ప హీరోలకు పాడే వారు కాదు. అదీ అయన కు ఇతర కళాకారుల పట్ల ఉన్న గౌరవం. ఇప్పటి సంగీత దర్శకులు రాజేశ్వర రావు గారిని ఆదర్శంగా తీసుకొంటే బాగుంటుంది.