మొహంలో ఎలాంటి ఎక్స్ ప్రెషన్ లేకుండా.. నోటి నుంచి ఒక్క డైలాగ్ కూడా పలకకుండా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే లెజెండరీ కమెడియన్ చార్లీ చాప్లిన్. ఆయన తెరపై కనిపిస్తే చాలు కన్నీటిని సైతం మరిచిపోయి.. కళ్లలోంచి నీళ్లొచ్చేలా నవ్వేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఆయనను అభిమానించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అంతటి మహా నటుడి పాత్రలో నటించడమంటే మాటలు కాదు. గతంలో చిరంజీవి ఓ సినిమాలో చార్లీ చాప్లిన్ క్యారెక్టర్ వేసి నవ్వించే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత అలీ కూడా ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. చాలామంది నటులు చార్లీ చాప్లిన్ బాటలో నడుస్తూ ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు.. ఇంకా చేస్తూనే ఉన్నారు. అయితే.. తాజాగా ఓ అందాల భామ చార్లీ చాప్లెన్ పాత్రలో నటించేందుకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో తన అప్ డేట్స్ షేర్ చేసుకుంటుంది. అయితే.. తాజాగా తన పోస్ట్ తో అందరినీ షాక్ కి గురి చేసింది. చార్లీ చాప్లిన్ లా సూట్ వేసుకొని, చేతిలో కర్ర పట్టుకొని కెమెరాకు ఫోజులిచ్చింది.
నవ్వు లేకుండా ఉన్న రోజు వృథా అయినట్టే.. అంటూ చార్లీ చాప్లిన్ చెప్పిన కొటేషన్ ను క్యాప్షన్ ఇస్తూ పోస్ట్ చేసింది నబా నటేష్. కామెడీ కింగ్ చార్లీ చాప్లిన్ గెటప్ ఎందుకు వేసిందో చెప్పకపోయినా.. ఫోటోలతో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ మధ్యే నితిన్ తో కలిసి మ్యాస్ట్రో హిట్ కొట్టిన నబా నటేష్.. చార్లీ చాప్లిన్ గెటప్ లో పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.