
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]యా[/qodef_dropcaps] క్షన్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం పర్సనల్ గ తనకే కాకుండా చిత్రం లొ నటించిన హీరో హీరోయిన్స్ కూడా మంచి పేరు తెచ్చింది. సరైన హిట్ లేక కష్టాల్లో ఉన్న హీరో రామ్ కి ఇంక టాలీవుడ్ లొ బోణి కొట్టని భామలు నిధి అగర్వాల్, నాభ నటేష్ ఈ ముగ్గురికి ఇస్మార్ట్ శంకర్ మంచి బ్రేక్ ఇచ్చింది. ఇస్మార్ట్ శంకర్ కి Rs 50 లక్షలు మాత్రమే పారితోషకం అందుకున్న నిధి ఇంక నాభ ఇప్పుడు తమ రేట్లను డబల్ చేసినట్లు సమాచారం. మహేష్ బాబు అల్లుడు అశోక్ గళ్ళ హీరోగా వస్తున్న చిత్రంలో నటించేందుకు నిధి కోటి రూపాయలు డిమాండ్ చేసినట్టు సమాచారం. బెల్లంకొండ శ్రీనివాస్ తొ జతకట్టబోతున్న మరో ఇస్మార్ట్ బ్యూటీ నాభ కూడా దాదాపు కోటి రూపాయలు అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇస్మార్ట్ బ్యూటీస్ డిమాండ్ చేసిన దానికి ప్రొడ్యూసర్స్ కూడా సై అని చెప్పడం విశేషం.