ఇంట్రెస్టింగ్ గా త్రివికమ్ శ్రీనివాస్ ఆమెని “గుంటూరు కారం” చిత్రం నుంచి తొలగించడం అనేది అందరికీ షాక్ గా మారింది. అప్పటికే త్రివిక్రమ్ పూజా హెగ్డే కాంబినేషన్ లో మంచి హిట్స్ ఉన్నాయి. ఇక గుంటూరు కారం కి రిపీట్ చేయడంతో అంతా ఒక్కసారిగా షాకయ్యారు. అయితే అప్పట్లో చాలానే కారణాలు ఆమెని పక్కన పెట్టడంపై వినిపించాయి కానీ ఇప్పుడు ఒక ఊహించని ఇంట్రెస్టింగ్ పాయింట్ ఆమెని పక్కన పెట్టడంలో సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ బాబుతో చేస్తున్న చిత్రం “గుంటూరు కారం” కి అలాగే దానికి ముందు చేసిన “అరవింద సమేత వీర రాఘవ” సినిమాతో ఒక లింకప్ ఉందని. అయితే ఇది ముందు లేదు కానీ తర్వాత యాడ్ చేయడంతో రెండు సినిమాల్లో ఒకే హీరోయిన్ అయిపోతుంది అని అందుకే గుంటూరు కారం నుంచి పూజా హెగ్డే ని తప్పించారని అంటున్నారు. ఇది వినడానికి ఇంట్రెస్టింగ్ గానే ఉంది కానీ నిజం అయితే మాత్రం ఇంకో లెవెల్లో ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ కనెక్షన్ ఉందా లేదా అనేది మరికొన్నాళ్లు ఆగి చూడాల్సిందే..!!