
దళపతి విజయ్ ఫైనల్ సినిమా రెమ్యూనరేషన్!
KVN ప్రొడక్షన్స్ ఈ సినిమా కోసం ఏకంగా రూ. 380 కోట్లు వెచ్చించింది. అయితే ఇందులో మేకింగ్ కంటే రెమ్యునరేషన్లకే ఎక్కువ ఖర్చయ్యిందని సమాచారం. దళపతి విజయ్ తన లాస్ట్ మూవీ కావడంతో ఏకంగా రూ. 220 కోట్లు పారితోషికం తీసుకున్నారట. అంటే మొత్తం బడ్జెట్‌లో దాదాపు 60% ఆయనకే దక్కింది. హెచ్. వినోద్ (దర్శకుడు) రూ. 25 కోట్లు. అనిరుధ్ సంగీతం కోసం 15 కోట్లు. బాబీ డియోల్ & పూజా హెగ్డే చెరో 5 కోట్లు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది..
‘జన నాయగన్’ దళపతి విజయ్ రికార్డు బ్రేకింగ్ రెమ్యునరేషన్!మమితా బైజు శ్రీలీల తరహా పాత్రలో నటిస్తున్న ఈ యంగ్ బ్యూటీకి రూ. 60 లక్షలు అందినట్లు తెలుస్తోంది. ఇతర ఖర్చులు ప్రొడక్షన్, సెట్స్ మరియు సీజీ వర్క్ కోసం మరో 100 కోట్లకు పైగా ఖర్చయినట్లు అంచనా. విజయ్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల్లోకి వెళ్తున్న తరుణంలో, ఈ సినిమాను తన పొలిటికల్ కెరీర్‌కు ఉపయోగపడేలా మలచుకున్నారని స్పష్టమవుతోంది. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను తిరగరాస్తుందా? లేక కాపీ విమర్శలతో చతికిలబడుతుందా? అన్నది వేచి చూడాలి..!!