సాయి పల్లవికి బోలెడన్ని సినిమా అవకాశాలున్నాయి. మరి ఇలా ఎందుకు చేస్తుందని ఆరా తీస్తే.. చదువు తర్వాత సినిమాల్లో బిజీగా మారిపోవడం వల్ల వైద్య వృత్తికి న్యాయం చేయలేకపోయాననే బాధ మనసులో ఉండిపోయిందట. అందుకే కోయంబత్తూర్ లో సొంతంగా ఆసుపత్రి నిర్మించాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఆ ఆసుపత్రి ద్వారా సాయిపల్లవి, ఆమె చెల్లెలు పూజ కలసి ప్రజా సేవ చేయాలని నిర్ణయించుకున్నారని వినికిడి. ఇప్పుడా ఆసుపత్రి నిర్మాణం పనులు సాయి పల్లవి దగ్గరుండి చూసుకుంటోందని తెలిసింది.
ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యే వరకూ సినిమాల వైపు చూడనని చెప్పిందట. అందుకే పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినా.. తిరస్కరిస్తుందని టాక్. ఆసుపత్రి పూర్తయిన తర్వాత కూడా ఆమె అక్కడే ఉండి పేషెంట్లకు సేవ చేయాలనుకుంటుందని కూాడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ విషయంపై ఆమె స్పందించకపోవడంతో ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. ఇదే గనుక నిజమైతే సాయి పల్లవి ఇక సినిమాలకు దూరం అవుతుందేమో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆమె అభిమానులు. మరి దీనిపై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!!