తాజాగా ‘OG’ కి సంబందించిన న్యూస్ ఒకటి నెట్టింట హల్చల్ చేస్తోంది. అది ఆషా మాషీ న్యూస్ కాదు. క్రేజీ అప్డేట్. పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ కూడా నటిస్తున్నట్లు సమాచారం. ఓజి సెకండ్ హాఫ్ లాస్ట్ లో డార్లింగ్ కనిపిస్తాడని టాక్. సుజిత్ తో కలిసి ప్రభాస్ సాహోకి వర్క్ చేసాడు. మరొకసారి సుజిత్ ప్రభాస్ ని సంప్రదించగా డార్లింగ్ కూడా పాజిటీవ్ గా స్పందించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ OG లో క్యామియో రోల్ చేస్తున్నట్టు తెలియటంతో OG క్రేజ్ మరింత పెరిగింది. మేకర్స్ నుంచి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ రానప్పటికీ, పవన్ సినిమాలో ప్రభాస్ నటిస్తు న్నాడనగానే OG మూవీ పై హైపు పెరిగింది..!!