in

Is Keerthy Suresh Planning to Quit Films After Marriage?

చిన్ననాటి స్నేహితుడు అంటోని తో కీర్తి సురేష్ పెళ్లి!
కీర్తి సురేష్ ఇటీవలే పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. తన చిన్ననాటి స్నేహితుడి అంటోని తట్టిల్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. డిసెంబర్ 12 న వీరి పెళ్లి గోవాలో గ్రాండ్ గా జరిగింది. హిందూ, క్రిస్టియన్..రెండు సాంప్రదాయాల్లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ సినిమా షూటింగులకి బ్రేక్ ఇచ్చి వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఇప్పటివరకు కొత్త సినిమాలేవీ కమిట్ కాలేదు..

పెళ్లి తరువాత కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై!
పెళ్ళికి ముందు సైన్ చేసిన బాలీవుడ్ మూవీ ‘బేబీ జాన్‘ ను పూర్తి చేసి ఇటీవల ప్రమోషన్స్ లో కూడా పాల్గొంది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ సినిమాలకు గుడ్ బై చెప్పబోతుందని ఓ వార్త బయటికొచ్చింది. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకి గుడ్ బై చెప్పి తన భర్తతో కలసి దుబాయ్ దేశంలో సెటిల్ కాబోతోందని పలు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆంథోని కి దుబాయ్ లో పలు వ్యాపారాలు ఉన్నాయి. అలాగే తన భర్తతో కలసి బిజినెస్ పనుల్లో తోడుగా ఉండాలని భావిస్తూ ఈ నిర్ణయం తీసుకుందని కోలీవుడ్ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది..!!

jhanvi kapoor was not the first choice for jr ntr devara!